మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా శంభీపూర్ రాజు

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి శంభీపూర్ రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత ప్రకటన చేశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన శంభీపూర్ రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సనిహితుడిగా పేరుంది. కాగా, నాలుగు స్థానాలకు బీఆర్‌ఎస్ ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.