కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి జూపల్లి
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు ఎంఎల్సీ దామోద్ర్ రెడ్డి కుమారుడు కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, కొడంగల్ మాజీ శాసన సభ్యుడు గురునాథ్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపిపి ముద్దప్ప దేఖ్ముఖ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులు మల్లు రవి, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.













