ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తో.. అమెరికాకు చెందిన క్వాల్ కమ్ ఒప్పందం

కృత్రిమమేధ ద్వారా మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్‌వేర్‌లను రూపొందించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కు అమెరికా చెందిన క్వాల్‌కమ్ సంస్థ 1.86 లక్షల డాలర్లను గ్రాంట్‌గా అందజేయనుంది. ఈ సొమ్ముతో మూడేళ్ల పాటు పరిశోధనలు కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమమేధ ప్రయోగశాలను క్వాల్‌కమ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లీండర్ వాన్ డోర్న్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ప్రయోగశాలలో పరిశోధనలు చేసే విద్యార్థులు, ఆచార్యులకు ఇన్నోవేటర్ డెవలప్‌మెంట్ కిట్ పేరుతో ప్రాథమిక అవగాహన పరిజ్ఞానాన్ని అందజేస్తున్నామని ట్రిపుల్ ఐటీ ఆచార్యులు రమేశ్ లోగనాథన్ తెలిపారు. వేర్వేరు అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం ద్వారా కొత్త ఆవిష్కరణలను తెచ్చేందుకు పరిశోధకులు కృషి చేయనున్నారని ట్రిపుల్ ఐటీ సంచాలకులు ప్రొఫెసర్ పీజే నారాయణన్ తెలిపారు.