తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రేషన్ ఉన్నవారికి వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారి డీలర్‌షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఖాళీగా ఉన్న 1,629 రేషన్ డీలర్ల భర్తీకి కూడా చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.