అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు సన్నాహాలు
హైదరాబాద్ నగరంలో నవంబరు 28- 29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (జీఈఎస్)కు సన్నాహాలు చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. రూ.8 కోట్లతో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక, ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలు దీనికి హాజరు కానున్నారు. మాదాపూర్లోని రహేజా ఐటి పార్కులోగల వెస్టిన్ హోటల్లో తన సిబ్బందితో కలిసి ఇవాంక ట్రంప్ బస చేస్తారని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.













