బ్రిక్స్ దేశాల మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్లో బ్రిక్స్ దేశాల మంత్రుల బృందానికి ఏర్పాటు చేసిన విందుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం.
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు & బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్-2026 ల నేపథ్యంలో బ్రిక్స్ మంత్రులకు అధికారికంగా విందు ఏర్పాటు చేసిన కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ.
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, సిఎం ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, డీజీపీ సీవీ ఆనంద్, కార్మిక శాఖ కార్యదర్శి హరి చందన, ఇతర ఉన్నతాధికారులు








