అందుకే విద్యాశాఖను నాదగ్గరే పెట్టుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి
కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
చదువొక్కటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది. గత ప్రభుత్వం విద్యాశాఖపై నిర్లక్ష్యం వహించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖకు సీనియర్ అధికారులను నియమించాం.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలకు, త్యాగాలకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలన్న అమరుల ఆశయాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది.
మౌలిక వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇంటి పేర్లు నీళ్లు అని పెట్టుకున్నోల్లు కూడా ఈ పాఠశాల గురించి ఆలోచన చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ పాఠశాల భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకపోతే వందేళ్లయినా సమస్య పరిష్కారమా కాదు.ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదట ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాం.
విద్య లో దేశంలో తెలంగాణ 18 వ స్థానం పొందింది.
విద్యలో తెలంగాణను దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్యార్థులకు, యువతకు సాంకేతిక నైపుణ్యం అందిచే చర్యలు చేపట్టాం. ఐటీఐలను బలోపేతం ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం.
జర్మనీ, జపాన్ లో బ్లూ కాలర్ జాబ్స్ కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
27, 50,000 మందికి పంద్రాగస్టులోగా యంగ్ ఇండియా కిట్స్ పంపిణీ పూర్తి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారని మిమ్మల్ని అడిగితే మీ రేవంతన్నను చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ముఖ్యమంత్రి స్థాయికి చేరా. ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి.
కలం పట్టి తెలంగాణ భవిష్యత్తును తీర్చి దిద్దాలి. చదువుతోపాటు మైదానాల్లో పోటీ పడండి. మట్టిలో మాణిక్యాలను వెలికితీయండి. క్రీడల్లో రాణించిన మీ భవిష్యత్తును తీర్చి దిద్దే బాధ్యత నాది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్షా 8 వేలు ఖర్చు చేస్తుంది..బాగా చదువుకోండి… జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోండి.
హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు.








