అసెంబ్లీ సమావేశాలు..కరోనా పరీక్షలు…
ఓ వైపు అంతకంతకూ కరోనా వ్యాప్తి పెరుగుతున్న పరిస్థితిలో మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా అసెంబ్లీ వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు నిర్ణయించారు. ఈ మేరకు వీరు శనివారం ఆదేశాలు జారీ చేశారు.
దీనిలో భాగంగా అసెంబ్లీకి హాజరవుతున్న ఎమ్మెల్యేలు అందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ విధుల్లో నిమగ్నమైన పోలీసులు, భధ్రతా సిబ్బంది, ఇతర అన్ని రకాల విధుల్లో ఉన్న సిబ్బందికి కరోనా పరీక్షలు చేయనున్నారు. వీరే కాకుండా అసెంబ్లీకి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.













