గ్రేటర్ లో పెరిగిన కరోనా వైరస్ రోగులు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వరకు 229 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీటిలో 100కు పైగా కేసులు గ్రేటర్లోనేనమోదయ్యాయి. ఈమేరకు హైదరాబాద్ జిల్లాలో 75..రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఇప్పటికే 11మంది మ •తి చెందగా, వీరిలో ఎనిమిది మంది గ్రేటర్ వాసులే. ఒక వైపు వైరస్ ఒకరి నుంచి మరొకరికిచాపకింద నీరులా విస్తరిస్తుండటం..మరో వైపు గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 20 నుంచి 30పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో మహానగరంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రోగుల విషయంలో అత్యంత గోప్యతనుపాటిస్తూ…వివరాలు వెల్లడించడం లేదనేఅనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.













