పారదర్శక విచారణ కోసమే.. ప్రభుత్వం ఆ విచారణ : జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై న్యాయ విచారణను అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంపై న్యాయ విచారణను అడ్డుకోవాలని తన మిత్రపక్షమైన బీజేపీని బీఆర్ఎస్ సాయం కోరింది. జ్యుడీషియల్ ఎంక్వయిరీ చాలా పారదర్శకమైంది. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం ఆ విచారణ జరిపిస్తోంది. జ్యుడీషియల్ విచారణలో అవసరమైతే సీబీఐ సాయం తీసుకోవచ్చు. బీజేపీ నేతల మాట్లాల్లో కేసీఆర్ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తోంది అని ఆరోపించారు.













