విజేతలకు సీఎం కేసీఆర్ అభినందనలు
స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్రెడ్డిలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అబినందించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.













