ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. ఆలోచించి వేయాలి : కేసీఆర్
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మంథనిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. పార్టీ అభ్యర్థి పుట మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జనం గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. పార్టీల చరిత్రలు చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది. గిరిజన, ఆదివాసీల విషయంలో కాంగ్రెస్ సరైన విధానాలను అవలంభించలేదు. పీవీ మొదలుపెట్టిన రింగ్‌రోడ్డును పుట్ట మధు పూర్తి చేశారు అని తెలిపారు. రూ.100 కోట్ల ప్రత్యేక నిధితో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య ఐక్యత లోపిస్తోందని, అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయతీ పెట్టుకుంటాం. అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని అన్నారు.













