రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్మాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్దనారీశ్వరునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరీ జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.













