వలసల వనపర్తిని.. వరిపంటల వనపర్తిని చేసిన మొనగాడు ఎవరు?
వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిని చేసిన మోనగాడు చేసింది ఎవరు? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రనసంగించారు. కొందరు కొందరు కాంగ్రెస్ నేతలు అక్కడికిరా ఇక్కడికి రా అంటున్నారు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నారు. నేను రావాల్సిన అవసరం లేదు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందెవరు? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కోట్లాడిందెవరో ప్రజలు ఆలోచించాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పని చేశారు. ఒక వైద్య కళాశాల కూడా తీసుకురాలేకపోయారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పట్టుబటి అయిదు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు.
ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసింది. వారి అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. తెలంగాణ గురుకులాల్లో వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పం. మళ్లీ గెలిస్తే పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. రైతులకు ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఎదురిచ్చిందా? ఎన్ని మోటార్లు పెట్టారని ఇవాళ రైతులను ఎవరైనా అడుగుతున్నారా? రైతులు కట్టాల్సిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లింస్తోంది. రైతుల భూమిపై వారికే అధికారం కట్టబెట్టాం. వారిపై వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వో పెత్తనం లేకుండా చేశాం. వనపర్తి గొప్ప పట్టణంగా వెలుగొందుతుంది అని అన్నారు.













