మహాసభలు విజయవంతం కావాలి
తెలుగు మహాసభలకు అన్ని వర్గాల ప్రజలనూ ఆహ్వానిస్తే బాగుండేదని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అసెంబ్లీలోని మీడియా హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అందెశ్రీ లాంటి వారిని కూడా ఆహ్వానించాల్సిందన్నారు. సభలకు ఆహ్వానం అందలేదని కొందరు భావిస్తున్నారని, అటువంటి వారిని ఆహ్వానించాలని సూచించారు. మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించిన జానా, సభలకు హాజరవుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్కు అభినందనలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష ఔన్నత్యానికి అందరూ దోహదపడాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నందున తాను తెలుగు మహాసభలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.













