బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు ఆయన జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.