వచ్చే ఎన్నికల్లో తెలంగాణను.. కాషాయం చేయడం తధ్యం
సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ విడత పాదయాత్రను బండి సంజయ్ దిగ్విజయంగా పూర్తి చేశాని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్ర చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణను కాషాయ చేయడం తధ్వమన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోని కేసీఆర్ కావాలా? ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్న ప్రధాని మోదీ కావాలా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మోదీ కావాలా? కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ కావావా?. నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ కావాలా? మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ ఆప్ అమలు చేస్తున్న మోదీ కావాలా?. అవినీతి జాతిపిత కేసీఆర్ కావాలా? అవినీతి రహితంగా పాలన చేస్తున్న మోదీ కావాలా?. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి కేడీ కావాలా? దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్న మోదీ కావాలా? అని ప్రశ్నించారు.













