ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిమయించే అవకాశం ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇంతకు ముందు మాజీ మంత్రి మాణికల్యాలరావును అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ హైకమాండ్ భావించింది. అయితే, హైకమాండ్ ఆఫర్ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీపై అనునిత్యం విరుచుకుపడే సోము వీర్రాజు పట్ల అధిష్ఠానం మొగ్గు చూపింది. మరో నేత కన్నా లక్ష్మీనారాయమణ పేరును కూడా పరిశీలించినప్పటికీ ఆయన పట్ల కొన్ని అభ్యంతరాలు రావడంతో, చివరకు ఆయనను పక్కన పెట్టినట్టు సమాచారం.













