కేసీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదు : విజయశాంతి
సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. సైదాబాద్ బాధిత కుటుంబాన్ని విజయశాంతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖ చేతులు కట్టుకొని కూర్చుందా అని ప్రశ్నించారు. ఉదయం ఆరు గంటలకు వచ్చి డబ్బులు ఇచ్చి నోరు మూసేద్దామనుకోవడం సమంజసం కాదని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.













