వరద బాధితులకు అరబిందో ఫార్మా రూ.5 కోట్ల విరాళం
హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చింది. వరద బాధితులకు సహాయక చర్యల కోసం అరబిందో ఫార్మా రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను అరబిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు కలిసి చెక్కును అందజేశారు. మీనాక్షి ఇన్ఫాస్ట్రక్చర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ కంపెనీ ప్రతినిధులు కూడా కేటీఆర్‌కు చెక్కు అందజేశారు. అరబిందో ఫార్మా, మీనాక్షి ఇన్ఫాస్ట్రక్చర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.













