వారసుల కోసం ఆ రెండు పార్టీల మధ్య … ఒప్పందం : అమిత్ షా
వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలనీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. హుజురాబాద్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. వారసుల కోసం ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి పాలన గురించి ప్రజలకు విముక్తి కలగాలని అన్నారు. ఎంఐఎం అధినేత ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు.
మజ్లిస్‌కు భయపడి 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ రూ.7 లక్షల కోట్లు ఇచ్చింది. బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి బీసీ వ్యక్తి తొలి సీఎం అవుతారు. బీజేపీని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం. పేద మహిళలకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.













