సీఎం రేవంత్‌రెడ్డితో నెదర్లాండ్స్ రాయబారి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఢల్లీిలో నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరాడ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢల్లీికొచ్చిన ముఖ్యమంత్రితో ఆయన అధికార నివాసంలో నెదర్లాండ్స్ రాయబారి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఢల్లీి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు.