సరికొత్త రికార్డు సృష్టించిన శబరిమల ఆలయం
ఈ సంవత్సరం మండల పూజ సీజన్లో కేరళ, శబరిమలలోని అయ్యప్ప దేవాయలం రికార్డు స్థాయిలో భక్తులను ఆకర్షించి, భక్తులందించే కానుకల విషయంలో పాత రికార్డులను బద్దలు కొట్టింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకూ ఆలయంలో మండల పూజలు నిర్వహించగా, మొత్తం 168.84 కోట్ల ఆదాయం లభించింది. ఇది ఆల్ టైమ్ రికార్డని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. అయ్యప్న దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోందని వారు అన్నారు. మరకజ్యోతి ఉత్సవాల కోసం ఈ నెల 30న శబరిమల ఆలయాన్ని తిరిగి తెరవనున్నామని తెలిపారు.













