వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కు విజయసాయిరెడ్డి రిటార్ట్..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. జగన్ కి అత్యంత సన్నిహితుడు విజయ్ సాయి రెడ్డి.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపి తరఫున అతనికి పోటీగా నిలుస్తున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ సాయి రెడ్డి.. వేమిరెడ్డి తనపై విసిరిన విమర్శలకు తన స్టైల్ లో సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ. “నేను ఎన్నికల్లో గెలిస్తే నెల్లూరు ను పట్టించుకోనని.. ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అవుతానని వేమిరెడ్డి చలోక్తులు విసురుతున్నారు. అయితే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ లు చేయడం అలవాటు ఉన్న వేమిరెడ్డి.. అలవాటులో పొరపాటుగా ఆ పదాన్ని నాకు వాడినట్టు ఉన్నారు” అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తనకు ఎటువంటి వ్యాపారాలు లేవని.. సమావేశాలు టైం లో తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటాను అని విజయ సాయి రెడ్డి అన్నారు. పార్టీలు మారడం వేమిరెడ్డికి తెలిసినట్టుగా నాకు తెలియదు అని విజయ సాయి రెడ్డి అన్నారు. అంతేకాకుండా పార్లమెంటు సభ్యుడిగా అటు పార్లమెంటుకి రాకుండా ఇటు నెల్లూరులోని ఉండకుండా వ్యాపార పనుల కోసం దేశ విదేశాలు తిరుగుతున్నది మీరే.. అంటూ వేమిరెడ్డి పై విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు.













