వేమిరెడ్డి పై విరుచుకుపడ్డ విజయ్ సాయి రెడ్డి.. ఇంతకీ అసలు విషయం అదే..
నెల్లూరు వైసీపీ లోకసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా జొన్నవాడలోని అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది అని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది చంద్రబాబుకు చివరి ఎన్నికలని చెప్పిన విజయసాయిరెడ్డి.. త్వరలో చంద్రబాబు టీడీపీ ను బీజేపీ లో విలీనం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఐదు సంవత్సరాల పాలనలో జగన్ ప్రజల గుండెల్లో నిలిచారని.. అందుకే జగన్ ను ప్రజలే గెలిపించుకుంటారు అని ధీమా వ్యక్తం చేశారు. నల్లపరెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్య పెళ్లి కొడుకుని.. ఆసరా ఇచ్చిన జగన్ కు వెన్నుపోటు పొడిచి తిరిగి టీడీపీ లోకి వెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యే ,మంత్రి కావాలి అని ఆశిస్తున్న వేమిరెడ్డి కుటుంబానికి నిరాశ ఎదురవుతుందని నల్లపరెడ్డి అన్నారు. ఈసారి నెల్లూరులో విజయ్ సాయి రెడ్డి విజయకేతనం ఎగురవేస్తాడు అని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.













