వ్యవసాయంతోనే భారతీయ సంస్కృతి : ఉపరాష్ట్రపతి
వ్యవసాయం భారతీయ సంస్కృతి అని, దేశ సంప్రదాయాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న అగ్రి హ్యాకథాన్-2017 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 60శాతం మందికి వ్వవసాయమే జీవనోపాధి అని పేర్కొన్నారు. వ్యవసాయంలో సరికొత్త సాంకేతికతను జోడించాలన్నారు. మారుతున్న, ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులను సాగు చేయాలన్నారు. వ్యవసాయం నుంచి రైతులు తప్పుకోకుండా చూడాలని సూచించారు. మార్కెట్ సదుపాయం, విలువ జోడింపు వంటి అంశాల్లో శ్రద్ధ చూపాలన్నారు. రైతులు వరి నుంచి ఇతర పంటలకు మారాల్సి ఉంది. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులను సాగు చేయాలన్నారు. రైతులకు ఇంకా తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని సూచించారు. పెద్దనోట్ల రద్దుతో గదుల్లో దాచిన నల్లడబ్బు బయటకు వస్తోందని, ఆ ధనాన్ని రైతులకు సకాలంలో రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.













