సీఎం చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ రాశారు. అపూర్వరీతిలో చేసిన పౌరసన్మానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని వెంకయ్య లేఖలో పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన తీరు అద్భుతమని తెలిపారు. కేంద్రమంత్రిగా చివరి సంతకం పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన 2.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఫైలాన్ ఆవిష్కరణ సంతోషమన్నారు. తెలుగు నేలను, తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోనని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని లేఖలో పేర్కొన్నారు.













