Minister Anita: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు : మంత్రి అనిత

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ నేడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల తొలిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత (Anita) , ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Chowdhury) , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్‌బాబు తదితరులు దర్శించుకునిన ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఆమె దసరా (Dussehra) ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అంగరంగ వైభవంగా అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, చెప్పారు. భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశామని వెల్లడిరచారు. మొత్తం 36 విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారని, 4,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేశాం. ఆ సమయంలో వారు దర్శనం చేసుకుంటారు. వీఐపీ భక్తులు దర్శనానికి వచ్చినా, సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాం. స్త్రీ శక్తి పథకం వల్ల ఉచిత బస్సుల్లో చాలా మంది మహిళలు వస్తారని శిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వమే ఉండాలి అమ్మవారిని కోరుకున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ క ల్యాణ్‌కు శక్తిని, యుక్తిని, దైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను అని తెలిపారు.