అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదు
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు కేంద్రం భయపడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆరోపించారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనే బీజేపీ అడ్డుకుంటోందని అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో భాగంగా రహస్య ఓటింగ్ పెడితే సొంతపార్టీలోనే చాలా మంది వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనన్న భయం బీజేపీలో ఉందని అన్నారు. పార్లమెంటు చరిత్రలోనే ఇది చీకటి కోణమని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పెట్టినవి ఏమీ అమలు చేయలేదని అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని సృష్టం చేశారు.













