సీఎం రమేష్ ఇంట్లో టీడీపీ ఎంపీల భేటీ
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలు చర్చిస్తున్నారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎంపీలు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. మా ఆందోళనను కేంద్రం పట్టించుకోలేదని, అమిత్షా వ్యాఖ్యలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. పార్లమెంట్ సభ్యులు కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంపట్ల బీజేపీకి గౌరవం లేదన్నారు. అలాగే చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ మాట్లాడుతున్నారని, ఏపీ హక్కులు కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు..













