విశాఖ నుంచే రాష్ట్ర పాలనా వ్యవహారాలు
నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర పాలనా వ్యవహారాలు విశాఖ నుంచే సాగనున్నాయి. మహానాడు నేపథ్యంలో ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా విశాఖలోనే మూడు రోజుల పాటు ఉండనున్నారు. రాష్ట్ర పాలన అంతా ఇక్కడి నుంచే సాగనుంది. ముఖ్యమంత్రి ఏకంగా 3 రోజుల పాటు ఉంటున్నందున ఆయన పేషీలోని కొంత మంది అధికారులు కూడా విశాఖకు వస్తున్నారు. సీఎం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు వంటివి నిర్వహిస్తారు. ఒక పక్క పార్టీ పరమైన కార్యక్రమంలో పాల్గొంటూనే ఇంకోవైపు రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.













