పిఠాపురం సెగలు అమరావతికి, రంగంలోకి చంద్రబాబు..!
పిఠాపురం నియోజకవర్గ కూటమిలో రేగిన చిచ్చు ఇప్పుడు నేరుగా అమరావతికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సిఎం చంద్రబాబు ఫోటో వివాదం, తనపై జరిగిన దాడుల గురించి ఎస్వీఎస్ఎన్ వర్మ(Svsn Varma) చేసిన ట్వీట్లను అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు(Chandrababu).. వర్మను అమరావతి(Amaravati) పిలిచారని, సంయమనం పాటించాలని సూచించినట్లు సమాచారం. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వర్మను అమరావతికి రావాలని బాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం లేదా శనివారం వర్మ ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు, జనసేన(Janasena) నేత దొరబాబు వర్గీయులతో వస్తున్న విభేదాలపై వర్మ పూర్తి నివేదికను బాబు ముందు ఉంచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వర్మ ఆరోపిస్తున్నట్లుగా అక్కడ వైసీపీ కోవర్టులు పెత్తనం చెలాయిస్తున్నారని అధిష్టానం నమ్మితే, దొరబాబు వర్గానికి చెక్ పెట్టే అవకాశం ఉంది.
వర్మ వంటి సీనియర్ నేత అలిగితే అది పిఠాపురంలో కూటమికి పెద్ద దెబ్బ అని భావిస్తున్న బాబు, ఈ భేటీ ద్వారానే పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నారు. దొరబాబుపై కూడా వర్మ గట్టి ఫిర్యాదులు సిద్ధం చేసుకున్నట్లు టాక్. బాబు నుంచి పిలుపు వచ్చిందన్న వార్తతో వర్మ అనుచరుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పిఠాపురంలో టీడీపీ ప్రతిష్టను కాపాడేందుకే వర్మ పోరాడుతున్నారని, అధిష్టానం ఆయనకే మద్దతు ఇస్తుందని వారు నమ్ముతున్నారు. మరి వచ్చే వారం జరగబోయే ఈ భేటీ పిఠాపురం రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి







