Pawan Kalyan: నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు : డిప్యూటీ సీఎం పవన్
నియోజకవర్గాల పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విజయవాడలో పార్టీ ఎమ్మెల్యేలు (MLAs), ఎంపీలు (MPs), ఎమ్మెల్సీలతో పవన్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపై వారు చర్చించారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆరా తీశారు. కమిటీల ఏర్పాటు విషయంలో పిఠాపురం (Pithapuram) మోడల్ని మిగతా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని సూచించారు. కూటమి పార్టీల సయోధ్య విషయంలో దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







