Byreddy Sabari: మారెడ్డి లతారెడ్డి విజయం ఖాయం : ఎంపీ శబరి
పులివెందుల జగన్ అడ్డా కాదు, టీడీపీ (TDP) కంచుకోట కాబోతోంది అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Sabari) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప, పులివెందులకు ఐదేళ్లలో జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ అన్నారు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి రూ.1,500 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బును దారి మళ్లించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దోచుకోవడంతోనే సరిపోయింది. పల్లె పల్లెకు సాక్షి వారిని దించారు. ఏదైనా జరిగితే టీడీపీపై నెపం పెట్టాలని కుట్ర చేశారు. వైసీపీ కుట్రలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Mareddy Latha Reddy) విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.







