బీజేపీ ఏపీకే కాదు.. దేశానికే అనవసరం
బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కే కాదు దేశానికే అనవసరమని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కృషివల్లే ఏపీకి పెట్టుబడుల వరద వస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి శ్రమను కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ విలువలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. వైసీపీ, జనసేనకు కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. వైసీపీ, జనసేన దగాకోరు పార్టీలని అన్నారు.













