క్రిస్మస్ వేడుకల్లో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి

విజయవాడ లెనిన్ సెంటర్ లో విజయ పార్లర్ నందు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకల్లో పలువురు తానా నాయకులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డ వెంకటరమణ, తానా సర్వీసెస్ కో ఆర్డినటర్ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ యార్లగడ్డ శశాంక తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణా గోదావరి ఖండ పీఠాధిపతి గౌ. బిషప్ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు, శ్రీమతి జాషువా తల్లి గార్లచే ప్రత్యేక ప్రార్ధన నిర్వహించడం జరిగినది. ఈ సెమి క్రిస్మస్ పురస్కరించుకొని ప్లమ్ కేక్ మిక్సింగ్ మరియు బేకింగ్ కార్యక్రమమునకు గౌ. బిషప్ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ తండ్రి, శ్రీమతి జాషువా, ట్రాఫిక్ డి.సి.పి కె.బాబురావు, ఏ.సి.పి ఎమ్. వెంకటేశ్వరరావు, గవర్నర్ పేట సి.ఐ కె.సురేష్ గారు, కృష్ణా మిల్క్ యూనియన్ ఎం.డి కొల్లి ఈశ్వరబాబు మరియు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు పాడి రైతులకు, వినియోగదారులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.










































































