ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హెదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని షిండే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నాడు పార్లమెంట్ అంగీకరించిందని ఆయన చెప్పారు. బీజేపీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్దమైనదేనని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోనాల కోసం జరిగే ప్రతి పోరాటానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని సృష్టం చేశారు. మోదీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆరోపించారు. అన్ని వర్గాల్లోనూ మోదీపై వ్యతిరేకత పెరగుతోందని తెలిపారు. కథువా, ఉన్నావ్, గుజరాత్లో అత్యాచార ఘటనలు బాధాకరమన్న ఆయన నిందితుల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.













