Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేత
Supreme Court: తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి దాఖలైన ఒక కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై సీబీఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.
అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సీబీఐ పర్యవేక్షణలో సిట్ (SIT) ఏర్పాటు చేశామని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఏవైనా ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు ఉంటే సీబీఐ దృష్టికే తీసుకెళ్లాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.
ఇవి కూడా చదవండి








