సాయేష్ కుటుంబ సభ్యులకు తానా సాయం: వెంకట్ మేడపాటి
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాకు చెందిన యువకుడు వీర సాయీష్ మృతి చెందారు. వీర సాయేష్ మృతి విచారకరమని ఏపీఎన్ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి పేర్కొన్నారు. అమెరికా నుంచి భౌతికకాయాన్ని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని తానా ప్రతినిధులు తమ సహాయసహకారాలు అందిస్తున్నారని, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కావాలంటే తీసుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు. భౌతికకాయం రెండు, మూడు రోజుల్లో స్వస్థలానికి చేరుకుంటుందని వెంకట్ తెలిపారు.













