టీడీపీ లోకి రఘురామరాజు.. పోటీ అక్కడ నుంచే..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంపీ రఘురామకృష్ణ రాజుకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కొన్న నేతగా ఆయనకు ప్రజలలో మంచి గుర్తింపు కూడా ఉంది. రాబోయే ఎన్నికలలో తాను టీడీపీ తరఫున పోటీ చేస్తాను అని ఆయన ఎన్నో సందర్భాలలో చెప్పారు. కానీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఆయనకు టికెట్టు దక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మను ప్రకటించడం జరిగింది. ఇంత జరిగినా తనకు టికెట్ వస్తుంది అన్న ఆశను మాత్రం ఆయన వదులుకోలేదు. రీసెంట్ గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత రఘురామకృష్ణ రాజుకు చంద్రబాబు ఓ గుడ్ న్యూస్ చెప్పారని టాక్. ఉండి నియోజకవర్గం నుంచి ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి పాలకొల్లులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణ రాజు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.













