ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు … సుప్రీంకోర్టులో ఊరట
ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్, వ్యక్తిగత సిబ్బందిపై హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకూ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను నిర్బంధించి దాడి చేశారనే ఆరోపణలపై రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై హైదరాబాద్ పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.













