బాబుకు నరేంద్ర మోదీ గ్రీటింగ్స్!
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తిగా కనిపించింది. ఏప్రిల్ 20నే చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నా’ అని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.













