కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్
టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పవన్ విజ్ఞప్తి చేశారు.













