పవన్ పై బ్లేడ్ తో దాడి.. ఇంతకీ చేయించింది ఎవరో..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారానికి పూనుకున్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన భద్రత గురించి చేసిన ఒక స్టేట్మెంట్ వైరల్ అవుతుంది. తనపై తన భద్రతా బృందంపై కొందరు వ్యక్తులు రేజర్ బ్లేడ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని జనసేన అధ్యక్షుడు ఆరోపించారు. పిఠాపురం లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పవన్.. ఈ మధ్య జనంలోకి వెళ్ళినప్పుడు ఎవరో కొందరు కావాలని బ్లేడ్లతో జనంలోకి జొరబడి.. తనపై తన సిబ్బందిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ఈ ప్రయత్నం వెనుక ప్రతిపక్షం హస్తము ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తనతో ఫోటోలు దిగే సమయంలో నిర్దిష్ట ప్రోటోకాల్ పాటించాల్సిందిగా తన అభిమానులను పవన్ కోరుకున్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అతని అభిమానులను.. జనసేన మద్దతుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పవన్ ప్రవహించాలి అని సలహాలు కూడా ఇస్తున్నారు.













