సేంద్రీయ ఎరువుల తయారీని ప్రోత్సహించాలి : లావు అంజయ్య చౌదరి

వ్యర్థాలతో సేంద్రీయ తయారీ విధానం ప్రతీ ఇంటికి అవసరమైన ప్రక్రియని, రెండు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రీయ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి అన్నారు. మన ఇంటిలో ఉత్పత్తయ్యే సేంద్రీయ వ్యర్థాలను క్షేత్ర స్థాయిలోనే సేంద్రియ ఎవరుగా మార్చే విధానంపై ఆంధ్రా హాస్పిటల్స్ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వర్మీ కంపోస్టు ప్లాంట్ల వ్యవస్థాపక సలహాదారు వెంకట సుబ్బారావు మద్దుకూరి సౌజన్యంలో అబ్బీపేటలోని పైడియ్య వీధిలో వెంకట సుబ్బారావు మద్దుకూరి నివాసంలో సేంద్రీయ ఎరువు తయారీ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథీగా హాజరైనా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ఇలాంటి ప్రక్రియను ప్రదమంగా ప్రారంభించే అవకాశం ఇచ్చిన వెంకట సుబ్బారావు మద్దుకూరికి ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రీయ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ నూతన ప్రక్రియలను అమలు చేసేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ పరీక్షా పలితాల్లో జాతీయ స్థాయిలో మన విజయవాడ నగరాన్ని ప్రథమ స్థానంలో తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి ప్రక్రియతో సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్యా, వైద్య, ఉపాధి, పర్యాటక అవకాశాలతో పాటు పర్యావరణ కాలుష్య నియంత్రణ జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా, నాహిద్ రోజ్ సోసైటీ, ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎ.వీ. సీతామహాలక్ష్మి, సాదారణ కార్యదర్శి వై. సుచిత్ర, కోశాధికారి వౌ.పద్మజ, సంయుక్త కార్యదర్శి కె.విజయబాబు, డాక్టర్ అజయ్, డాక్టర్ మధుసూధనరావు పాల్గొన్నారు.










































































