విద్యాంధ్ర వైభవం
ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగనుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు త్వరలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. తెలుగు విద్యార్థులకు ఐక్యరాజ్యసమితిలోనూ, అలాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించే అవకాశం దక్కడం ఎంతో అరుదు. ఈ అవకాశం నూజివీడు ట్రిపుల్ ఐటిలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు దక్కటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది.













