రిటైర్డ్ ఐఏఎస్‌లకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్రమాస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లకు సీబీఐ, ఈడీ కోర్టు వారెంటును జారీ చేసింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంట్రామిరెడ్డి, రాజగోపాల్‌ను సీబీఐ, ఈడీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈడీ కేసుల విచారణపై సుప్రీంకోర్టు వెళ్తామన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనపై ఈడీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టే లేనందున విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలని కోర్టును ఈడీ కోరింది. వాన్‌పిక్, దాల్మియా, జగతి పబ్లికేషన్స్, రాంకీ కేసుల విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.













