పొత్తులపై జనసేన క్లారిటీ…వాళ్లతో మాత్రమే కలుస్తాం
పొత్తులపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. 175 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తామని సృష్టం చేశారు. కేంద్రంపై పోరాటానికి పవన్ కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో పవన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ కలిసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి అని ట్విట్టర్లో పవన్ పేర్కొన్నారు. 25 సంవత్సరాల యువత భవిష్యత్ కోసం తాము పనిచేస్తున్నామని, అనుభవజ్ఞులైన వారితో పాటు కొత్తవారికి అవకాశమిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.













