అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టు పై కేంద్రం సృష్టత
అమరావతి రైల్వేలైన్ విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తి లేదని కేంద్రం సృష్టం చేసింది. దాంతో అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టుపై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఆంధప్రదేశ్ ప్రజలకు నిరాశే మిగిలింది. అమరావతి రైల్వేలైన్ ఖర్చు పంచుకోవడానికి కూడా ఆంధప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా లేదని కేంద్రం పేర్కొంది. అందుకే ఆ హామీలను పక్కనెట్టినట్లు కేంద్రం సృష్టం చేసింది. ఈ ప్రకటనతో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కినట్టయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని రైల్వేశాఖ తేల్చిచెప్పడం గమనార్హం.













