ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తామని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అంతేకాకుండా ఉత్సవాలు జరిగే 10 రోజుల్లో విధులు నిర్వర్తించేందుకు ఒప్పంద ప్రాతిపదికన మరికొంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అంలకారాల్లో భక్తులకు దర్శన మివ్వనున్నారు.













